Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీ పుట్టిన దేశమంటే
స్వేచ్ఛ సమతల సంగమం
మంచి మమతలకు మార్గం
మానవత్వం నిండే జాతియత
మనిషికి గౌరవించే సమత
అందరమొక్కటనే ఐక్యత
ఆడవారి పట్ల సోదరభావం
అమ్మలకు నమస్కరించే సంస్కారం
వారికి స్వేచ్ఛ పంచే వారసత్వం
అంటరానితనం లేని సమాజం
అందరినీ ఆదరించే మనిషి తత్వం
కులమతాల పారద్రోలే మనస్తత్వం
ఆయన కల గ్రామ స్వరాజ్యం
రైతు జీవితం సస్యశ్యామలం
దేశానికి కలుగు అభివృద్ధి ఫలం
తెల్లోనిడినెదిరించిన ధైర్యం
అమరుల చిందించిన రుదిరం
స్వతంత్ర ఫలాలు అందరికందడమే న్యాయం
గాంధీ మనందరికీ జాతిపిత
అదే మనందరికీ ఘనత
ఆయన బాటలో నడవడమే
మనకు భవిత
- సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.