Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీ పుట్టిన దేశమా ఇది..?
మహాత్మా కలలుగన్న స్వరాజ్యమా ఇది?
పేదవాడు పేదవాడి గానే మిగిలిపోయే
ధనికుడు ధనవంతుడై ఎదిగిపోయే..
అసమానతా భావాలు ప్రబలి పోయే
అందని ఎత్తుకు సమానత్వం ఎగిరిపోయే..
పసిమొగ్గలు పై అఘాయిత్యాలు
మహిళా మణులు పై అత్యాచారాలు
స్వేచ్ఛ పేరుతో అర్ధనగ్న ప్రదర్శనలు
వ్యాపార ప్రకటనలకు మహిళా మూర్తులు
కులం పేరుతో కుతంత్రాలు
మతం పేరుతో మారణహోమాలు
బలైపోతున్న బడుగు బలహీన వర్గాలు
హక్కులు అడిగితే బలవంతపు కేసులు
మాంసం పేరుతో మానవ హత్యలు
వేష బాషల వ్యత్యాసంతో మతోన్మాదాలు
మానవత్వం మరచిన దానవులు
అధికారం కోసం కుళ్ళు కుతంత్రాలు
కర్షకుడు కార్పోరేట్ చేతుల్లో కీలుబొమ్మైనాడు
కార్మికుడు తన ఉద్యమ హక్కు కోల్పోయాడు
చిరు వ్యాపారులు వడ్డీలతో కృంగిపోయారు
బ్రతుకు బాటలో అలసి సొలసి ఓడిపోయారు
చట్టాలను చుట్టాలుగా మార్చేసుకుంటూ
నల్ల చట్టాల ముసుగులో దోచేసుకుంటూ
ప్రజల మనోభావాలను కాళ్ళతో తొక్కెసుకుంటూ
సంరక్షించాల్సిన ప్రభుత్వమే దగాకోరు అవుతుంటే
నిజంగా ..గాంధీ పుట్టిన దేశమా ఇది..?
మహాత్మా కలలుగన్న స్వరాజ్యమా ఇది?
- షేక్ అబ్దుల్ హకీమ్
ఐడియల్ యూత్ మూవ్మెంట్
గుంటూరు జిల్లా అధ్యక్షులు.
సెల్:9949524991