Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజాయితీ , నిరాడంబరత, నిబద్దత, వినయ సంపన్నానికి నిలువెత్తు సాక్ష్యం
విధానాలే నీ నిధానాలై భారత ప్రజల గుండెల్లో నిలిచి పోయిన జై జవాన్ జై కిసాన్ ఇప్పటికీ సజీవ సాక్షాలే.
నీ ఆదర్శమైన జీవితం భారత ప్రజల మదిలో ముద్ర వేసి మరిచి పోలేని జ్ఞాపకం అయినావు.
ఎనమిది మైళ్ళు నడిచి హరిచంద్ర పాఠశాలలో చదివి హరిచందృడవైనవు.
ధైర్య సాహసాల తో గంగా నది ని ఈది చదువుకొని గొప్ప వ్యక్తి వి ఆయినావు.
భారత దేశ చరిత్ర లో శాస్త్రి లాంటి రాజకీయ నిజాయితీ పరుడు లేడు అని అనడంలో అతిశయోక్తి లేదు.
జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో కూతురు అనారోగ్యానికి గురై విషయాన్ని అధికారుల దృష్టి కి తీసుకొచ్చిన వెంటనే విడుదల చేసి వారి హృదయాలను గెలుచుకున్న మానవతా వాది.
రైల్వే మంత్రి గా ఉన్నప్పుడు జరిగిన ఒక దుర్ఘటనకు నా విధి నిర్వహణ లోపమెనని పదవికి రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తి.
చనిపోయే వరకు కూడా స్వంత ఇల్లు లేని నిరుపేద ప్రధానమంత్రి ప్రపంచంలో ఎక్కడ చూడలేని సజీవ ఉదాహరణ.
ఇంత గొప్ప ఆదర్శవంతమైన వ్యక్తి జయంతి ని విస్మరించడం చాలా బాధాకరం.
దేశం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన త్యాగశీలి మన శాస్త్రి గారు.
అక్టోబర్ 2 అనగానే గాంధీ జయంతి అనే మది లో గుర్తుంది కానీ శాస్త్రి గారి జయంతి అనే జ్ఞాపకాన్ని మరచింది మన చరిత్ర.
6411 రూపాయలు తన మరణం తర్వాత మిగిలిన సంపాదన అంటే అతని నిజాయితీ ఎలాంటిదో చెప్పనక్కరలేదు.....
విదేశాల్లో అమరుడైన మీకు ఇవే మా వందనాలు.
(లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భముగా)
- దేశిని శ్రీధర్
M. A , M.Ed
అధ్యక్షుడు
తెలంగాణ సామాజిక రచయితల సంఘం
వరంగల్ అర్బన్ జిల్లా
9849818284