Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోరుబందర్ జనకుడే ప్రాణాలొడ్డె భరతావనిలో..
పోరులేని మువ్వన్నెల పతాక ముద్దు బిడ్డలకై..
పరపీడ సంకెళ్ళ సత్యాగ్రహ కలకై ఎదురొడ్డె బాపూ..
పరదేశ కబంద ఆక్రమణ దుస్థితి గాంచనే నేడు..
నిగ్గు తీస్తి నాటి వర్ణ వివక్ష వ్యతిరేక హరిజనోద్దరకమై..
సిగ్గులేని నేటి కులగజ్జి పీడ సమాజ దుర్మార్గ్మమ్ జూడు
నాడు పడతి మీ ఉద్యమ బాటలో ఆశువులు బాసినే..
నేటి యువతి మృగ కామాంధుల చెరలో నలిగిపోయెనే.
అహింసా జ్యోతుడై ఆయుధ ముట్టని శాంతుడా..
నేటి హింసా ఉగ్రవాద రక్తసిక్త జననిగడ్డ జూడుడే..
జాతిపితై ఆఖరి రక్తపు బొట్టు మాతృభూమికై కార్చెనే..
నేడు సారాయి బొట్టుకై ఆలి పుస్తెలమ్మే మృగపిశాచులై.
కార్మిక,కర్షక,రైతు భాందవ,చంపారన్ ఉద్యమికుడా..
నేడు అన్నదాతకు ఆత్మ బలిదాన ఆశ్రయమాయె..
శాంతి,అహింసా,సత్యాగ్రహ,వర్ణ వివక్ష రధసారధికుడా..
మీ గాంధేయ హస్త పాదంతో స్పృజించు నేటి వ్యవస్థను
ఖాదీవస్త్ర స్వదేశీయమా, నేటి నడమంత్రపు వేషాల
పునరుద్దరణకై మళ్లీ జనించుమా మా గాంధేయుడా..
- శ్రీమతి గద్దె అనంతలక్ష్మి
ప్రధానోపాధ్యాయని
నరసరావుపేట, గుంటూరు
8500988499