Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరుపేదలు , నిరుద్యోగులు లేని లోకమొకటి
చింతలువింతలు లేని లోకమొకటి
ఆకలి చావులు ,ఆశల ఎండ మావులులేని లోకమొకటి
అన్యాయం ,అధర్మం లేని లోకమొకటి
కరువుకాటకాలు లేని లోకమొకటి
మానవుణ్ణి మానవుడే వంచించే నాటకాలు లేని లోకమొకటి
హత్యలు ,ఆత్మ హత్యలు లేని లోకమొకటి
కష్టాలు, కన్నీళ్లూలేని లోకమొకటి
దౌర్జన్యం,దారిద్ర్యం లేని లోకమొకటి
దోపిడి,రాపిడీ లేని లోకమొకటి
దాడులు,పాడులు లేని లోకమొకటి
మోడులు ,బీడులులేని లోకమొకటి
వడగాడ్పులు,జడ ఏడ్పులు లేని లోకమొకటి
తప్పులు,అప్పులు లేని లోకమొకటి
హింసలు,ధ్వంసలులేని లోకమొకటి
కక్ష్యలు,వివక్షలులేని లోకమొకటి
ప్రమాదాలు,ప్రళయాలు లేని లోకమొకటి
ప్రకృతి ధ్వంసం లేని లోకమొకటి
కార్చిచ్చులు, కర్షకుల అప్పుల ఉచ్చులు లేని లోకమొకటి
అసత్యం ,అశాంతి లేని లోకమొకటి
పొరుగువారి పోరుగోలలు, సరిహద్దుల్లో గొడవలు లేని లోకమొకటి
కులాలు, మతాలు లేని లోకమొకటి
ఈర్షా, ద్వేషాలు లేని లోకమొకటి
కోపాలు, తాపాలు లేని లోకమొకటి
వాదాలు,వివాదాలు లేని లోకమొకటి
రాక్షసత్వం,దానవులు లేని లోకమొకటి
అబద్ధం,అణుయుద్ధం లేని లోకమొకటి
సమసమాజపు నవలోకమొకటి
శోకమెరుగని మానవలోకమొకటి
అలాంటి ఆ నవలోకంకోసం
విశ్వవీధుల నిలచి
అష్టదిక్కుల పిలచి
పంచభూతాలను తలచి
నవభావకవనం విరించి
హృదయశంఖారావం
యువరాగంలో పూరించి
స్వాగతమంటాను
నేను స్వాగతమంటాను
- నల్లగొండ రమేష్
8309452179