Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గజ్జె ఘల్లు ఘల్లున మోగుతోంది
బతుకమ్మ ఆటలో చిందేయాలని....
గాజులు గలగల లాడుతానయి
చప్పట్ల మోతలో జిగేలు మనాలని....
పెట్టెలో పట్టుబట్ట పులకరిస్తోంది
సోపతోల్లను గల్శి కొత్త గాలి పీల్సుకోబోతున్నాని....
సొమ్ములన్నీ సొగసులద్దు కుంటానయి
పుత్తడి బొమ్మ ఒంటిపై జేరి ధగధగ లాడాల్నని....
పసుపుకుంకాలు మురిసిపోతున్నాయి
ముదిత మేనుకు మాకన్న మేటిలేరని....
పూలన్నీ విరగబూసి పరవశిస్తానయి
పల్లె అందాలన్నీ చెరువుకు అద్దాల్నని....
ఆడపిల్ల బతుకమ్మై ఆరాటపడ్తాంది
అనుబంధాల కొలనులో దీపమై వెలగాలని....
- వకుళవాసు
9989198334