Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిరంగులు తుపాకీలతో
అప్రతిహతంగా సాగుతున్న
బ్రిటీష్ జైత్రయాత్రకు అడ్డుకట్ట
పడింది !
సత్యమనే శిఖరం మీద
అహింస అనే కంచుకోట కట్టుకుని
ఓ గోచిపాత రాయుడు చత్వారం
కళ్ళద్దాలు ఊతకర్ర పట్టుకుని
ప్రజల గుండెల్లో తిష్టేసుక్కూర్చుని
వలసవాదుల వెన్నులో
చలి పుట్టించాడు !
విభజించబడ్డ శక్తుల్ని ఏకీకృతం
చేసి.. వంచించబడ్డ బతుకుల్ని
పునరుత్తేజపర్చి లక్ష్యాన్ని నిర్ధేశించేడు
ఆ మృదుమధుర భాషణం ముందు..
సామ్రాజ్యవాదుల తిరకాసువాదం
వీగిపోయింది
ఆత్మనిర్భరత ముందు అహంభావం
నిలువలేదని రుజువైంది
ఆ బోసినవ్వులోంచి స్వేచ్ఛా సమ
భావనలు తళుక్కున మెరిశాయి..
---- భీమవరపు పురుషోత్తం
సెల్ 9949800253