Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాప కింద నీరురా
చైనీయుడు పంచెరా
చంపివేయ కుంటే
చావగొట్టు నిన్నురా!
మాయదారి జబ్బురా
మనల బతకనివ్వదురా
మంచిగానే యుండురా
పొంచి ముంచివేయురా!
అలుసు ఇవ్వబోకురా
గొలుసు కట్టే ఔనురా ఆదరించినావంటే
అల్లుకు పోతుందిరా !
అందరి మంచి కోరరా
అంతమొందించురా
అదినిన్ను పట్టిందా
అంతా మట్టేనురా!
బంధువైన గానీ
విందు మాత్రమివ్వకురా
సందు చూసుకుని మరీ
చిందులేయు చుండురా !
ఆట పాటలాడి
అన్ని చక్కగా తినీ
ఆరోగ్య వంతుడవై
అంతు దానిది చూడరా!
ముందు యున్న జాగ్రత్త
ముద్దుగా యుండురా
మోసకారి సోకిందా
శోకమే నీదిరా !
ఒక్క ప్రాణమే కాదు
లెక్క లేని ప్రాణాలు
ఒక్కటై అందరినీ
దక్కించు కొందమురా!
🙏🏾💐శశికళ.బి