Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధరిత్రిలో నిజంగా జరిగిన గాధ
చరిత్రలో సుస్థిర స్థానం పొందిన కథ
ఒక్క పిలుపుతో బక్కపలుచని వ్యక్తి
ఒక్కతాటిపై జాతిని నడిపిన శక్తి
చిన్నతనాన నిజాయితినే నమ్మిన గుణం
సత్య అహింసలే ఆయుధాలుగా రణం
మందు గుండులు మర ఫిరంగులు
గుండె ధైర్యం ముందు గడ్డి పోచలు
వందేమాతరమని తను నినదిస్తే
గంగాజమునలై పొంగె దేశభక్తి
సహాయ నిరాకరణ పిలుపునిస్తే
నిస్సాహాయులాయె ఆంగ్లేయులు
సంపూర్ణ స్వరాజ్య నినాదానికి
స్వేచ్ఛా భారత్ అవతరించే
స్వచ్ఛ భారత విధానానికి
ఇప్పుడు భారత్ పూనుకునే
గాంధీ తత్వం పాటించడమంటే
తను చూపిన పథంలో నడవడమే
-తంగెళ్ళపల్లి ఆనందాచారి,
9848683377.