Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంగ్లేయుల ఆగడాలు మితిమీరిన తరుణంలో
నల్లజాతీయులు తిరుగుబాటు కు సన్నద్ధమౌతున్న
సమయంలో
భారతీయులకొక ఆశా కిరణంగా
పొరుబందరులో జన్మించాడొక బాలగాంధీ
ఆయనే మోహాన్ దాస్ కరంచందు గాంధీ!
బాల్యంలోనే మహనీయుల గాధలు నేర్చుకుని
వీరుల వీరత్వాన్ని అలవర్చుకుని
జరుగుతున్న సంఘటనల నుంచి స్ఫూర్తిపొంది
అహింసనే ఆయుధంగా చేసుకుని
సత్యాగ్రహాలతో ఆంగ్లేయులను అగ్రహాలను తెప్పించి
భారతీయుల శక్తియుక్తులను ప్రదర్శింపచేసి
కులమతాలకు అతీతంగా భారతీయుల్ని
ఐక్యాపరచి
వారిలో స్వేచ్చాకాంక్షను రగిలింపచేసి
ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపించి
ఆంగ్లేయులను తరిమికొట్టన అహింసావాది గాంధీజీ!
- ఆళ్ల నాగేశ్వరరావు
నాజారుపేట, తెనాలి
సెల్ నెంబర్.7416638823