Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సబ్బండ వర్గాలను సమీకరించి
చైతన్య కిరణాలను రగిలించి
ఉద్యమ మొలకలు మొలిపించి
తెల్లోడి పెత్తనంపై మాటల తూటాలను పేల్చి
వెన్నులో వణుకు పుట్టించిన
పోరుబందర్ పోరు బిడ్డ
భారత ముద్దుబిడ్డ జాతిపిత గాంధీజీ
అహింసే ఆయుధంగా చేసుకొని
సత్యమే శ్వాస గా మార్చుకొని
లాఠీలను, జైళ్లను ఇష్టాలుగా మలచుకొని
'డూ ఆర్ డై' రాకెట్ ను విసిరి
బ్రిటిషోడికి కనువిప్పు కలిగించాడు
దేశానికి విముక్తి కలిగించాడు
స్వాతంత్ర్య ఫలాన్ని అందించాడు
జాతిపిత గా నిలిచాడు.
✍✍ తాటిపాముల రమేష్
శివనగర్, వరంగల్
7981566031