Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా రోగమా
కరుకు దేరి పోనావా
కనికరము లేదేమే
కాటికి పోవేమే!
చైనీయుల చంకనెక్కి
చక్కగా షికార్లు కొట్టి
జల్సాగా తిరుగుతూ
జనం లోకి దూరినావా!
తెల్ల దొరల తలనెక్కి
తైతక్క లాడేసి
తల్లీ పిల్లలనంతా
తలదాచ నీడలేక
తెలివి మీరిపోయావే
తరిమి వేతుము నిన్నే
తాడో పేడో నేడే
తేల్చుకుందాము రావే!
అన్ని దేశాలు తిరిగి
అందర్నీ మింగేస్తూ
దొడ్డి దారిలో నువ్వూ
దొంగలాగ దూరిపోయి
తుంగ చాపనెక్కి
టింగు రంగా మంటూ
టింగు టంగు మంటూ
సింగ లేడి వయ్యావే!
అష్ట కష్టాలు పెట్టే
దుష్ట దెయ్యానివే
దిష్టి తీసి నిన్నూ
దూరంగా తరిమేస్తాం
దుమ్ము ధూళి మొకందాన
దగ్గరకూ రాకె నువ్వు
దగ్గరకూ వచ్చావో
బుగ్గి పాలు చేస్తాము!
కొండ లాగ పెరిగిపోయి
పిండి పిండి చేస్తున్నావ్
దండగ కలుగ జేస్తూ
తొంగుండి పోనావే!
అండ దండ లేదనా
అందల మెక్కేస్తున్నావ్
అందరం ఒక్కటైతే
ఔటు చేసి నిన్నూ
అణగ్గొట్టేస్తాం!
మారణ హోమం వద్దు
మనుషుల జోలికి రావొద్దు
బుద్ది గానుండు ముందు
సద్దు మణుగుటే ముద్దు!
- శశికళ.బి