Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువతకైనా
నవతకైనా
బ్రతుకు బాధ్యత చెట్టై
అలవోకగా ఎదుగుతూ
తీగల్లే అల్లుకుంటూ పోవాలి
ఎదిగేకొద్దీ వొదుగుతూ
జీవితపు నడకలు జవసత్వం నింపుకోవాలి
నిరాశల నడుమ
నీ నడక కొన్ని నవ్వులతోనో
మరికొన్ని చీత్కారాలతోనో, అపహాస్యాలతోనో
బంధించి భాధించి ఉండొచ్చు
కంగారెందుకూ...,
చెమర్చిన కళ్ళకు
కాంతిపుంజం కనురెప్పలపై
నిలిచి,నిన్ను నిలువరిస్తుంది
కన్నీటి వీడ్కోలుకూ నీ నడకే
నాలుగో నేస్తం అవుతుంది
హృదయంపై వాలిన బడబాగ్నులు
బస్మీ పటలమై బ్రతుకు చిత్రం
నవ్వుల నావపై ఊరేగుతుంది...!!
- మహబూబ్ బాషా చిల్లెం
9502000415