Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తంగెళ్ళపల్లి ఆనందాచారి
9848683377
మేరుపర్వతం పక్కన మరే గిరులు కానరావు
వటవృక్షం పక్కన మరే తరులు నిలువలేవు
కానీ...ఓ మహనీయుని ప్రభ ముందర
మరో మహనీయుడే వెలుగుతాడు
గాంధీ మహాత్ముని ముందర
ఘనమైన వాడే నిలుస్తాడు
లాల్ బహదూర్ శాస్త్రిగా
నిజాయితీకి నిలువుటద్దమై కనిపిస్తాడు
గాంధీలా అతి సామాన్యుడు
ఘనతలో అంతే అసమాన్యుడు
అత్యున్నత పదవిలో ఉన్నా
అతి సాధారణ బ్రతుకు తనది
సత్యాగ్రహ పోరుతో స్వాతంత్ర్యం తెచ్చెనొకరు
శ్వేతహరిత క్రాంతులతో స్వాలంబన ఇచ్చెనొకరు
వందేమాతరమన్నది స్వాతంత్ర్య నినాదం
జైజవాన్ జైకిసాన్ స్వాలంబన విధానం
స్వాతంత్ర్య చరితను స్మరిద్దాం
శాస్త్రీజీ చతురతను గుర్తిద్దాం
జాతిపిత గాంధీని పూజిద్దాం
జాతిహితుడు శాస్త్రీనీ కొనియాడుదాం