Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల్లుట్ల సునీత
7989460657
భారతీయ ద్వితీయ ప్రధానిగా పగ్గాలు చేతబూనిన అద్వితీయుడు
భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలో
ఘనుడు
జాతీయ కాంగ్రెస్ రాజకీయ అగ్రగణ్యుడు
మహాత్మా గాంధీ ప్రభావంతో
జీవన గమనం సాగించి
ఇండో పాకిస్తాన్ యుద్ధంలో దేశాన్ని నడిపించి
రైల్వే మంత్రిగా హోంమంత్రిగా బాధ్యతలు ఎన్నో చేపట్టి
మిశ్రా దేశభక్తిని ప్రేరణగా పొంది
ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా
వెలుగొందిన స్ఫూర్తిప్రదాత లాల్ బహదూర్ శాస్త్రి
నమ్మకానికి మారుపేరు
జవహార్ లాల్ కు స్నేహశీలి
ఉపాధ్యాయులు అభిమానాలను చూరగొన్న మహనీయుడు
స్వాతంత్రోద్యమం పై మక్కువ పెంచుకుని
భయభక్తులతో పెరిగి
గంగా నది నీ ఈది విద్యనభ్యసించి
హేళన చేసిన చోటే సఖ్యత గా ఉంటూ
దేశానికి ధీరుడై
జీవితాంతం సొంత ఇల్లు లేకుండా జీవించిన నిరాడంబరత కు నిలువెత్తు నిదర్శనం
పాలకుల నిజాయితీని ప్రజలు శంకించే లాగా జీవిం చొద్దు అని హితోక్తి చేసిన వజ్రపు మచ్చు తునక
దేశ భక్తి నిండిన అభిమాన వంతుడు
జై జవాన్ జై కిసాన్ నీ నినాదమై
వినిపించేవిశ్వమున
జాతీయ నాయకుడిగా శ్లాఘిస్తూ
జ్ఞాపకార్థం విజయ గాట్లో నీ స్మారకం ఏర్పాటు చేసి
భారత జాతీయావత్తు ఘనంగా నీకు నివాళులు లిడగా
నీ జయంతి సందర్భంగా
నా అక్షర నీరాజనాలు అందుకో ప్రియతమా జోత/మా నేత
భారత జాతికి స్ఫూర్తి ప్రదాత