Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి,సికిందరాబాద్.
బానిస సంకెళ్ళలో బంధీలై
బాధాతప్త హృదయాలతో
చీకటిన మగ్గుతున్నప్పుడు
అరాచకాలు అడ్డూ ఆపులేక
పేట్రేగిపోతున్నప్పుడు..
సొంతింటిలో సైతం..
పరాయివాళ్ళలా బతుకు వెళ్ళదీస్తున్నప్పుడు..
పరమ శాంత స్వభావం చలించిపోయింది..
సాధుతత్వం తోటే సంగ్రామ బాట పడుతూ..
స్వాతంత్ర్య సాధన చేపడుతానని మాటిచ్చింది..
ఒక్క అడుగుగా మొదలైన ప్రయాణంలో ఎన్ని కాళ్ళు జత పడ్డాయో..
కొన్ని వేల చేతులు జెండాలు పట్టాయి..
కదంతొక్కాయి..
సత్యాగ్రహాలు..ఉద్యమాలు దారెంట జరుగుతూనే ఉన్నాయి..
ఒక చెంపన కొడితే మరో చెంప చూపమన్న మహాత్ముడి సాధు వర్తన ముందు
తెల్ల దౌర్జన్యం మోకరిల్లింది..
చడీచప్పుడు కాకుండా
అర్థరాత్రి స్వాతంత్ర్యం ఇచ్చి
మన దేశాన్ని వదిలి తోక ముడుచుకొని పారిపోయింది..
గాంధీజీ అమర్ రహే..!
హమేషా అప్నే దిల్ మే రహే..!!