Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారి మధ్య ప్రేమ జలపాతం లా దూకింది
మాటల సాగరం ఉప్పెనలా ఉప్పొంగింది
పెయ్యి లు పెనవేసుకొని ప్రేమ వీణ
తంతులు మీటి ప్రణయ గీతాలు పాడి
చెరువులో తామరం లా వికసించింది.
కలల ప్రపంచంలో తేలిపోతూ
ఊహల ఊయలలో ఊరేగుతూ
మధుర గుళికలు పంచుకుంటూ
కాలజ్ఞాన్ని రాసుకుంటూ
కొమ్మ మీద చిలకా గోరెంకల్లా కలసి
సాగరం లో నావ లా సాగుతున్రు
ఉరుములు, మెరుపులు లేకుండానే
'పరువు' అనే పిడుగు పడి
ఆటవికంగా కత్తులు దూసి,అంతంచేస్తూ
మనిషికీ మరణ శాసనం లిఖిస్తున్రు
పుడమిని రుధిరపుటేరులు పారిస్తున్రు
అంతరిక్షంలో అడుగు పెట్టినా
కడలిని కడిగేసినా
కంప్యూటర్ యుగంలో కూడా
కులోన్మాధం సర్పంలా బుసకొట్టి
మానవ సమాజానికి సవాల్ విసురుతుంది
గుణం కంటే ధనమే ముఖ్యమా ?
ప్రాణం కంటే 'పరువే' ముఖ్యమా ?
ఆస్తులు, అంతస్తులు పునర్నిర్మించుకోగలం కానీ ,
రాలిన పాణాన్ని రప్పించగలమా ?
హృదయాలను కాస్త విశాలంగా చేసుకుని
కరుణ వర్షాన్ని కురిపిద్దా
ప్రేమ పక్షుల ను బతకనిధ్ధాం
✍✍ తాటిపాముల రమేష్ (టీచర్)
శివనగర్, వరంగల్
7981566031