Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండితులకేకాదు
పామరులకూ ఆరాధ్యుడై
తెలుగుభాషనే కాదు
తెలుగు యాసను అద్భుతంగా పలికి
కోట్లహృదయాలను కొల్లగొట్టి
సరిగమలతో ఆడుకున్న బాలుడా!
చలనచిత్ర సంగీత పాలుడా
నీ ఊపిరి పాటగా మలిచావు
నువులేక అనాధ అయిన పాటను
ఓదార్చలేని అసహహాయలౌతున్నాము
"మావాడు" అనిపించే ఆత్మీయునికీ
ఎందరికో భవితనింపిన బ్రహ్మకు
సెలవుచెప్పలేని నిస్సహాయురాలై
తెలుగునేల తల్లడిల్లింది.
స్వర్గలోక కచేరిలో
శాశ్వత కళాకారుడిగా చేరిపోయిన
మా "బాలుని"
దాచుకో స్వామీ...దాచుకో
జాగ్రత్తగా దాచుకో...
- వేమూరి శ్రీనివాస్
9912128967