Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తానొక చైతన్య రథం..
నీతి నియమాలకు నిలువెత్తు దర్పణం..
నిబద్ధత కూడిన రాజకీయ ప్రస్థానం..
నిరాడంబర నిజాయితీ జీవనవిధానం
పవిత్ర గంగానది తీరాన
వారణాసి విశ్వేశ్వరుని సన్నిధానాన పరిపూర్ణ వికసిత కమలం..
భరతజాతి ఆకలి తీర్చేందుకు
జై జవాన్..జై కిసాన్!..అని నినదించిన గళం..
తెల్ల దొరల పాలనకి వ్యతిరేకంగా పోరాడి..
దేశ స్వాతంత్ర్యం కోసం సత్యాగ్రహాలు..
అకుంఠిత దీక్షా సంకల్పం
నవయుగ యువతకు మార్గదర్శి..
భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం
దేశ ప్రగతికి కీర్తి పతాకం
మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జీవితం..
అజరామరం..!
---సుజాత.పి.వి.ఎల్.