Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ.ప
కళ్యాణ రాముడు కౌసల్య తనయుడు
జానకీ నాధుడు జగమునేలె
దశరథ తనయుడు ధర్మమూర్తి యితడు
ఆదర్శ మైనట్టి అన్న యితడు
అనితర సాధ్యాలనవలీలగా జేసె
ప్రజలమంచి కొరకు పరితపించె
యెదురులేని మనిషి యెదిగారు ఒదిగారు
విజయాలు పొందారు విధులయందు!
ఆ.వె
చదవులన్ని చదివి పొదరింట పిల్లలు
ముదమునిచ్చునట్టి హ్రృదయరాణి
పొందగలరు సిరులు అందాల మనుమలు
కాంతి పంచినావు శాంతి మూర్తి!
సీ.ప
కార్య దీక్షాపరుని కనకాభిషేకాలు
కలుగుచుండును మాకు కనులపంట
అనురాగ దేవత అనుకూలవతి సతి
అలుపులేని వనిత అతని చెంత
ఆయురారోగ్యాలు ఐశ్వర్య మొందాలి
ఆదిదంపతులుగ అలరగలరు
పుత్రులూ,పౌత్రులూ పొందాలి సుఖములు
వాత్సల్య సంపద వంశమందు!
ఆ.వె
వీడుకోలు నేడు విలువల నెలరేడ
వెలుగు పంచవయ్య వేయియేండ్లు
పరిఢవిల్ల గలరు పదికాలములపాటు
పండితాగ్రగణ్య పరమహంస!
బి. శశికళ