Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ.ప
సీత రాముల వలె చిరకాలముండాలి
జీవితాంతము మీరు చింతలేక
పార్వతీ పరమేశు పరవశ దాంపత్య
మొందగలరు మీరు పొందికగను
పంచదార పాలును పరమాన్నమైనట్లు
పుణ్య దాంపత్యము పొంగిపొరలు
దేవునీ దీపాన తీరైన వెలుగులా
వెలుగులు విరజిమ్ము వేయియేండ్లు!
ఆ.వె
పెళ్ళి రోజు నాడు పెరగాలి బంధము
అంతరములు లేక ఆలుమగలు
పరమ సంతసముగ పదికాలములపాటు
పిల్ల పాప తోడ పల్లవించు!
బి. శశికళ