Authorization
Sat April 05, 2025 09:16:15 pm
సీ.ప
స్వాతిశయము కాదుసంస్కారవంతుడు
స్వార్థ చింతన లేని సంఘజీవి
సర్వదా పనులలో సాటిరారెవ్వరు
ఓర్పుతో జేయును నేర్పుకలిగి
నీదినాదీయన్న వాదులాటలు లేని
మానవత్వము యున్నమనిషి యితడు
ఆయురారోగ్యాలు ఐశ్వర్యము కలుగి
నవ్యదంపతులుగ నడువ గలరు!
ఆ.వె
సోమేశ్వరుని యింట శుభముగా పిల్లలు
చదువు సంధ్య యందు ముదము కలిగి
అమ్మ నాన్న మాట ఆజ్ఞగా భావించి
నిత్య శోభ కలిగి నిలువ గలరు!
బి.శశకళ