Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ.ప
కాంతి వెలుగు నట్లు కవితలను వ్రాయుము
పల్లవించి తెలుగు వెల్లి విరియు
తెలుగు తల్లి వెదకు తెలుగు నిఘంటువు
కళలు వెలుగు నటుల తెలుగు నేర్పు!
ఆ.వె
విలువలున్న యట్టి వేమన పద్యాలు
మమత కలుగ జేయు మనదు భాష
నరము లేక పెరిగె పరభాష పెత్తనం
పలుకు తేనె తెలుగు తెలియపరచు!
సీ.ప
మన కావ్య భాషంత మన్ను తినిన పాము
వెన్ను పూసయె లేక వెనుక బడియె
సరళ పదములను విరివిగా వాడుము
కనులతో జదివిన మనము జేరు
పాఠక జనులంత పరమ సంతసముగ
పలుకు యర్థాలను తెలుసుకొనుము
పరిణామ శీలివై వరవడి సృష్టించు
మూస ధోరణులను మూల పెట్టు
ఆ.వె
గలగల సెల యేర్లు గంగా నది వలెను
పరుగు లెత్త వలెను ప్రజల భాష
పాతిపెట్టి రిపుడు పరభాష వారలు
తెలుగు జిలుగు వెలుగు తెలుపుమయ్య!
బి.శశికళ