Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోలీసూ సోదరా పోరాడే వీరుడా
పోలీసూ సోదరా పోరాడే వీరుడా...
కోవిడ్డూ నైంటీను కోరలే చాచినా
కానరాని కరోనా కబళించి వేసినా
కన్నతండ్రి కన్నమిన్న కంటి రెప్ప నీవన్న
కంచెగా నీవుండి కాపాడె నీరెండ "పోలీసూ "
నేరేడు కండ్లున్న నిండైన సూర్యుడా
పండు వెన్నెల్లోన నిండు చంద్రుడా
కొండ కన్న మిన్నరా కోటి దండాలురా
ఎండ వానలైన గాని నిండు కుండ నీవురా "పోలీసూ "
హద్దు లేనట్టిదీ ఉద్యోగ జీవితం
ప్రొద్దున్న నుండియూ యుద్ధమే నీదిరా
అర్ధరాత్రి అపరాత్రి అలుపెరుగని బాటసారి
ఆదమరచి నిదుర పోవు ఆక్షణమెపుడో "పోలీసూ "
కడసారి తోడుగా కాటికాడ నీవురా
కరడు గట్టు వాడినైన గడగడ లాడిత్తువుర
వడగండ్లు పడినను జడివాన అయిననూ
మండు వేసవిలోన ఎండిపోయె గుండెరా "పోలీసూ "
పాచిపోవు భోజనం మార్చురీ జీవితం
వేచి చూచు శ్రీమతీ వాచిపోవు పిల్లలూ
గస్తీలు తిరిగేవు పస్తులే వున్నావు
కవచమేమొ ఖాకీది కష్టమేను నీది "పోలీసూ "
చెమట పూల గంధంతో సేద్యాన్ని చేతువన్న
పెదవి పైన నవ్వునై పదాల పువ్వునై
పొగడ పూల దండనై తలక్రింద దిండునై
అక్షరాల నాడించి ఆనందమిత్తు నన్న 'పోలీసూ "
బి. శశికళ