Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ.ప
సాహితీ సంద్రాన సాధించె లక్ష్యాలు
సంకల్ప బలమున్న సారధితడు
ఘనముగా గురిబెట్టె కలమును గళముగా
గాలిబు గీతాల కవిగ యితడు
భావాలు బంధాలు భావకవిత్వాలు
బాల్యాన్ని వర్ణించె బాగుగాను
అమృతాభిషేకము అద్భుత రచనాయె
అగ్ని ధారను బోలునతని కవిత!
ఆ.వె
తెలియబరిచె మనకు తిమిరాన సమరమ్ము
రుధిర దీపికైన రుద్రవీణ
దాశరథిగ బుట్టె ధీశాలి దేశాన
తేట తెల్లమయ్యె తెలుగు తెగువ!
పేరు :-బలరామమహంతి శశికళ, పాఠశాల సహాయకులు
ఊరు :-బారువ( శ్రీకాకుళం )
సెల్ :-8500269783