Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ.ప
పరమశివుని చెంత వరమాలనైతిని
తరములు మారిన గురుతు చేతు
శారదచరణాలు చేరితీ రవళిగా
పార్వతీ శ్రీలక్ష్మి పాటనైతి
అరవిరియు విరుల పరిమళముగ మారి
మరులు గొలుపునట్టి కురులజేరి
మురిపించు రసమయ మురళిగా కరములో
విరియు వెన్నెల రాత్రి వరదనైతి
ఆ.వె
కలత చెంద వలదు విలపించ వలదయ్య
కలమునందు కురియు కవితనైతి
కవనమందు కురియు కమనీయ కావ్యాలు
పరవశింప జేయు పద్య విద్య!
బి. శశికళ