Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఘనమైన భానుడు గాన గంధర్వుడు
తానుగా వీణలో లీనమాయె
వేదాలు నాదాలు వేణువే ప్రాణాలు
గానకోయిల లోని గాత్రమందు
కరకంకణములలో కనిపించు మణులలో నవరత్న కాంతుల నగలలోన
కరుణాది రసములా కావ్య నాయికలలో
అధరమందు గదలు పదనిసలుగ!
ఆ. వె
వనజగమున దిరుగు వాణి వదనమున
ప్రణవ సుధల మధుర పానమందు
ముదముగాను జేరె పదహారు కళలలో
పదిలమాయె మనదు హృదులయందు!
బి. శశికళ