Authorization
Sun April 06, 2025 12:17:54 am
సీ.ప
ప్రాణ మిత్రులు వీరు పరిణయ మాడిరి
కనిపించు స్వర్గమ్ము కాపురమున
భర్త మనసెరిగి బాగుగా మెలగును
భారమే కానట్టి భార్య యీమె
వీరి దారులొకటి విజ్ఞానవంతము
వినుతికి యెక్కెను వీరిప్రేమ
ఆయురారోగ్యాలు ఐశ్వర్య వంతము
శతవసంతము జూచు శాంతితోడ
ఆ.వె
పెళ్ళి రోజు నాడు ప్రేమతో మెలగాలి
అత్త మామలన్న ఆదరించి
పిల్ల పాపతోడ పెరగాలి సుఖములు
వృత్తి యందు వీరు వృద్ధిపొందు!
-శశికళ