Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ.ప
భూమినే జుట్టినా బుజ్జాయి నరసింహ
భరత ప్రధానిగా చరిత కలిగి
రాజకీయమునందు రాజనీతిజ్ఞుడు
రాణించె రతనమై రచన జేసి
పాములపర్తిగా ప్రజలకు స్ఫూర్తిగా
పదిహేడు భాషల పండితునిగ
అహరహం శ్రమియించి ఆలోచనలు జేసి
అబల జీవితమును అనువదించి!
ఆ.వె
ప్రగతి పథములోన పరుగెత్తె దేశమ్ము
బడుగు బతుకులన్ని బాగుచేసి
జగతిలోన వెలిగె జాతి పతాకమ్ము
తెలుగు పలుకు విలువ తెలియ పరచె!
-బలరామమహంతి శశికళ