Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ. ప
ఇద్దరైనను ముద్దు హద్దులొద్దనవద్దు
పెద్దలనిన మాట చద్దిమూట
అందరికిది నాంది ఆనందమును పొంది
ముందు వందనమంది ముదము పొంది
పొందిక సంసారమొందునానందము
ప్రజ్ఞ విద్యలయందు ప్రగతి జెందు
అజరామరము గీర్తి అందరికీ స్ఫూర్తి
ఆనందమౌమది అదియె ప్రగతి !
ఆ.వె
ఆంధ్రులదిగమించునధిక జనాభాను
బాధ లేక జనులు సేద దీరి
ఒద్దికైన ప్రజలు ఉద్యోగములుబొంది
దేశ భక్తి కలిగి దీక్ష బూని!
ఆ.వె
ఇంతి కంటి వెలుగు ఇంట్లోన సుఖములు
కంట నీరు దొలగి కాంతి కలిగి
అందుకొనును ఫలములాంధ్రులు కేంద్రాన
ముందు ముందు మోదమొంద గలము !
-బి.శశికళ, పాఠశాల సహాయకులు, సోంపేట