Authorization
Wed April 09, 2025 10:33:14 am
సీ.ప
మానవ జాతికి మకుటమీకాటను
మట్టి మనుషులను తట్టి లేపి
ఎండిన కనులలో నిండుగా చెలమలు
మండిన గుండెకు మమత పంచి
మరిపించె కరువును కురిపించె సిరులను
నరులుతరువులకు వరము నీవు
ఆనకట్టలుగట్టి ఆదుకొనినవాడ
గంగనే బంధించె ఘనుడనీవు!
ఆ. వె
ఆంగ్ల దొరవు నీవు ఆర్దరుకాటను
అలుపు లేనియట్టి అతిథివయ్య
ఆదరించినావు ఆదర్శ పురుషుడా
తాగునీటి బాధ తగ్గె మాకు!
ఆ. వె
కడుపు నింపినట్టి కారుణ్య మూర్తివి
బీడు వారు భూమి తోడునీడ
సత్కరించనివ్వు సౌజన్య హృదయుడా
స్మరణ జేతుమయ్య సార్వభౌమ!
-బి. శశికళ
పాఠశాల సహాయకులు (తెలుగు)