Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ.ప
కారు చీకటి లోన కాంతి పుంజము వోలె
కోటి సూర్య ప్రభలు గురువు మనకు
కామితములు దీర్చు కారణ జన్ముడు
కమనీయమైనట్టి కళలు నేర్పు
వెదజల్లు పరిమళం విద్య దానము జేసి
విజయ పధము జూపు విజ్ఞుడితడు
అభివృద్ధి కాంక్షించు ఆత్మ బంధువు వోలె
ఆదరించునితడు అలుపు లేక !
ఆ.వె
తరువు వంటి గురువు తరియింప జేయును
హరుడు ధరణి జేరె గురువు వలెను
గురుతు పెరుగు మనకు గురు పాదము ల చెంత
గురువు వరము మనకు మరువబోకు!
- శశికళ.బి