Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ విద్య చే శీలం నిర్మాణమవుతూ ఉన్నదో..
వ్యక్తి యొక్క మానసిక పరిపక్వత వృద్ధి చేoదుతుందో....
బుద్ధి వికసించి విలువైన సమాజాన్ని నిర్మిస్తుందో....
స్వశక్తి తో ఎవరి కాళ్ళ మీద వారూ నిలబడుతారో..
అలాంటి విద్య తోనే ఏ జాతి అయిన అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుంది అన్నది అక్షర సత్యం.
ఏ దేశ ఆర్థిక అభవృద్ధి కైన వెన్నుముక లాంటిది విద్యనే...
కానీ నేడు సామాన్యుడికి సాంకేతిక విద్య పల్లేర్ల మీద నడకే అవుతుంది.
ఇది ప్రభుత్వ వైఫల్యమా లేదా భోదకుల నిర్లక్షమా అన్నది తేల్చుకోవాలి.
ప్రభుత్వ ఉద్యోగం కోసం అహర్నిశలు కష్టపడి చదివి సంపాదించుకున్నoతవరకే వారి వాడి వేడి అవుతుంది.
ఉద్యోగం పూల పాన్పు అవుతుందే కానీ సమాజ అభివృద్ధి నిర్మాణంలో ఆటంకం అవుతుందనే సత్యాన్ని విస్మరిస్తున్నారు.
విద్యా కుసుమాలు సమాజ వెలుగు దీప్తి అయినప్పుడే దాని విలువ.
ప్రభుత్వ కళాశాలలో ఎంత మంది
ఐఐటియన్లు, ఎనైటియన్లు, మెడికోలు గా తీర్చి దిద్దుతున్నరనేది సూటి ప్రశ్న.
ప్రభుత్వం ప్రజా ధనాన్ని వేల లక్షలు వెచ్చిచడం అడవి కాసిన వెన్నెలేనా....
విద్యార్థులు లేరు అనే సాకు తో సంతృప్తి పడి ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దు.
విద్యా బోధనతో విద్యార్థుల మనసులను మార్చే మంత్రంగా వుండాలే కాని ...
మన మొకం బాగా లేక అద్దాన్ని పగలగొడితే ఎం లాభం అన్నట్టు వుంటుంది.
మన దగ్గర వున్న విద్యా ఆస్త్రలతో సమాజ మనుగడ సేవకులం కావాలి.
కార్పొరేట్ కి సాధ్యమైంది .
క్వాలిఫైడ్ అధ్యాపకులకు సాధ్యం కాదా !
విదేశీ విద్యా విధానం లో ప్రెసిడెంట్ కొడుకైన ప్రభుత్వ కళాశాలలో చదువాల్సిందే.
అటువంటి పటిష్టమైన చట్టాలు తెచ్చి విద్యను బలోపేతం చేయాలి.
ప్రభుత్వం విద్యకు సింహ భాగం బడ్జెట్ ను కేటాయించి జాతిని జాగృతం చేయాలి.
- దేశిని శ్రీధర్
M.A , M.Ed
అధ్యక్షుడు
తెలంగాణ సామాజిక రచయితల సంఘం
వరంగల్ అర్బన్ జిల్లా
9849818284