Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరాళమై మురిసే నా మది
గరళమై దుఃఖిస్తుంది ఖేదంతో
ఏదో తెలియని ఎడబాటు
తీరదనిపిస్తుంది నాకా లోటు
ఏదో తెలియని అలజడి
ప్రవహిస్తుంది నా ఎదలో రువ్వడి
సద్దిచెప్తుంది నా మది
విలపిస్తుంది ఈ తిథి
మధన పడుతుంది నా మది
తెలియాలి తుది ఏదని
మొరపెడుతుంది నా మది
మౌనంగా ఉండమని
కర్కశంగా మారి నా మది
కాటికి చేర్చింది నా కలలన్నింటిని
- దుబ్బాక అమర్నాథ్
6281495962