Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీలక్ష్మి కరుణించి చింతయే లేక
పాలించె ఇంద్రుడూ పరమ గర్వమున
స్థిరముగా నిలువదు శ్రీలక్ష్మి యింట
చిరకాలముండవు సిరులు సంపదలు
వరగర్వమొందిన వదలి పోవు సిరి
తరియించ కుండానే తరలి పోగలవు
ఊర్వశి తోడను ఉద్యానమందు
దుర్వాసముని రాక దూరాన జూచి
గర్వించి సురరాజు గమనించనట్లు
విర్రవీగిన నీకు వీడునీ పదవి
కురిపించె నిప్పులు కోపమ్ము చెంది
సిరి పోయి నీవింక చింతించగలవు
ఖ్యాతీ, భృగువులకు కరుణించి లక్ష్మి
కూతురై భార్గవి కొలువుండెయింట
మునిపల్లె వజ్రాలు ముంచెత్తె మణులు
మొరపెట్టుకొనిరి మునులు మాధవిని