Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శశికళ.బి
తరియించ తరమౌన తపసులం మేము
సిరిమాకు భారమౌను చెప్పుమాదారి
చేరిరి సాగరం చేతుల మ్రొక్కి
కోరి పెంచ వలయు కొమరిత నీవు
ఆనాటి అంబోధి అందాల సిరిని
ఆనందసాగరం అరచేత పెంచె
శాపమిచ్చె మహర్షి సహనమ్ము పోయి
శాపమ్ము విని రాజు శరణమ్ము వేడె
చెంచు లక్ష్మి వీడె చింతించె సురలు
కాంచనం కొరతతో కలతలో మునిగె
పువ్వులెన్నోదెచ్చి పూజలే చేసి
నవ్వుతో అలరారు నగుమోము జూసి
సంపంగి జిల్లేడు సన్నజాజీ పూలు
సొంపైన చామంతి సొగసు గన్నేరు
నందివర్ధనములు నల్లనీకలువ
మందార పున్నాగ మాలతీ మొగలి