Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శశికళ.బి
పెరుగిక్షు రస నేయి పెంపుగా తేనె
పరమ సాధ్వికి క్షీర పంచామృతాలు
కదళీ ఫలాలతో కమ్మనీ రుచులు
మధురాభిషేకాల మంగళారతులు
పసుపు కుంకుమ గంధ పారిజాతాలు
కుసుమాలతో నిన్ను కొలిచేను లక్ష్మి
పీతాంబరాలతో పేరంటమిచ్చి
గీతాల నాదాల గెలిచేను మదిని
యుజ్వలా తేజంబు నుయ్యాలనూపి
వింజామరలతోడ వీచి నీజోల
సింధూర తిలకాలు చీనాంబరాలు
మందార పూలతో మాతల్లి పూజ
చందనం కస్తూరి చామంతి పూలు
వందనాలందించి వరలక్ష్మి పూజ
పంచ భూతాలను ప్రమిదగా చేసి
మంచినే వత్తిగా మలచితీ లక్ష్మి
పాయసం పరమాన్న ఫలహారములను
నియమాల తాంబూల నీరాజనాలు