Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శశికళ.బి
సోమవారము నాడు శుభము జాబిలికి
భామకు ముత్యాల బంగారు నగలు
మంగళ వారాన మంచి పగడము
కొంగు బంగారమ్ము కొలుచు వారలకు.
శోభించు వజ్రాలు శుక్రవారమున
ఆభరణాలతో అలరించు లక్ష్మి
యిందుముఖి నగలు యింద్ర నీలములు
వందిత శనివార వరలక్ష్మి నగలు.
పొదిగిన పచ్చలు బుధవారమందు
మధు సూధనుని పత్ని మరకత మణులు
గురువారమందున గోవిందు సతికి
సిరి పుష్యరాగమ్ము శ్రీదేవి నగలు.