Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నమ్మి నెత్తినకెత్తుకుంటే ...
నట్టేట ముంచుతున్నరు
ఆదరిస్తరని "పీఠం" కట్టబెడితే ...
బతుకుల నిలువునా కూలుస్తున్నరు
రైతు సంక్షేమ పేరిట ….
వన్ నేషన్ వన్ మ్యాన్ అంటూ
భూటక బిల్లులు ప్రాణం పోసి
బహిరంగ దోపిడీకి తెర తీస్తున్నరు
ప్రగతి వంకన.. ప్యాకేజీ పేరిట
చీకటి చట్టాలకు రూపులద్ధి
ప్రజా విద్రోహనికి తెగబడుతున్నరు
కర్షకుని కష్ట పలితం కాజేసి...
బ్యూరోక్రాట్లకు పంచిపెడ్తున్నరు
మీ నిరంకుశత్వం ఇంకానా ?
ఇక మీదట చెల్లనివ్వమంటూ..
ఊళ్ళకూళ్లు ఏకతాటిపై నిలిచినయ్
రాజ్యంపై యుద్దానికి సన్నద్ధమైనయ్
దండు గట్టి దండోరా మోగించినయ్
పల్లె పల్లెలు పోరు బాట పట్టినయ్
ధిక్కార సెగలు రగులుకున్నయ్
తిరుగుబాటు పిడికిళ్ళు ఎత్తినయ్
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ….
కర్షక ప్రభంజనం పోటెత్తుతోంది
ముట్టడి యాత్ర అవిశ్రాంతగా సాగుతోంది
ఇక మీ ఆధిపత్య పీఠాలు ...
సామ్రాజ్యవాద రాజ సౌధాలు ...
పునాధులతో కుప్పకూలక తప్పదు
రైతు ఆత్మగౌరవ జెండా ఎగురుట నిక్కం
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట
9573996828