Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవ మృగాళ్లు మనీషాను చెరబట్టి
నాలుక తెగ్గోసి , వెన్నెముక విరిచి
సామూహిక లైంగిక దాడికి తెగబడితే…
నరక యాతనతో తనువు చాలించింది
కన్నవాళ్లను కడుపు కోతను మిగిల్చింది
ఇపుడు కఠిన శిక్షలు ఉరితీతలంటూ
పౌర సమాజం గొంతు విప్పుతుంది
నిరసన జ్వాలలు మిన్నంటుతాయి
నినాదాలు, దీక్షలు వెల్లువెత్తుతాయి
కొద్దీ ఘడియలు గడిచాక
గొల్లుమన్న నోళ్లు మౌనం వహిస్తాయి
బిగుసుకున్న పిడికిలి సడలుతాయి
సంతాప "దీపాలు" కొడిగడతాయి
వాట్స్ అప్, ఫేస్ బుక్కుల్లో
పోస్టింగ్ తాకిడి సద్దుమనుగుతుంది
లోగోల బ్యాగులు భుజానేసుకుని
మీడియా మరో వార్తా కవరేజి వెళ్తుంది
ఇంకేం అంతా శరా మాములే ...
ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమే ...
ఇదేకదా సభ్య సమాజ స్పందన తీరు
అయినా...ఇంకెన్ని ఆకృత్యాల బరిద్దాం?
ఇంకెందరి మృగాళ్లను వదిలేద్దాం ?
ఇకనైనా
మనదాక వస్తే...అనే నిర్లిప్తత వీడి
మనదే అన్న స్ఫురణకు రావాలి
జాతి జాతిగా ఏకమై ...
కామోన్మాద మూకల మర్మాంగాలు
ముక్కలు ముక్కలుగా ఛిద్రం చేసి
తలనరికి నడి బొడ్డున బంతాటాడుకోవాలి
క్రూరాతి క్రూరంగా అంతమొందించాలి
అప్పుడే బాధితుల ఆత్మకు అసలు నివాళి
- కోడిగూటి తిరుపతి
9573929493