Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శశికళ. బి
ఆ.వె
తల్లి దండ్రు లందు దైవాన్ని దర్శింపు
మగువ వెంట పోవు తెగువ వద్దు
కన్న బిడ్డ కొఱకు కన్నీరు బెట్టును
తల్లడిల్లు చుండు తల్లిదండ్రి!
ఆ.వె
తండ్రి తోను బిడ్డ తరతరాలుగ సేవ
పార తట్ట బట్టె పరుల కొఱకు
పొలము బోయి వచ్చి పొరుగు యాకలి దీర్చె
కడుపు నిండ కూడు కాంచడితడు!
ఆ.వె
గల గల గల గలల గంగాజలమ్ములు
జల జల జల జలల జలరవళులు
వల వల వల వలలు వారలు విసరగ
సల సల సల సలల జలచరములు!
ఆ.వె
పాండవాగ్రజునికి కండకావరమున్న
కౌరవాగ్రజుండు కబురుజేయ
యన్ని కోలుపోయె నారాజు యాటలో
కానకేగినాడు కడకుయతడు!
ఆ.వె
రాదిక సగపాలు రాజ్యమ్ము మీకును
హక్కు లేదు గనుక అడుగ వలదు
వినగ పాండు సుతులు వేరు దారియె లేక
కడకు యుద్ధమునకు కదలినారు!
ఆ. వె
బ్రతకలేక నాడు బడిపంతులనినారు
సంఘమంత నాడు సమ్మతించె
బ్రతుక నేర్చి నేడు బంగారు బతుకంటు
గారవంబు నేడు మారిపోయె!