Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తే.గీ
కొలను చంద్రుని వెన్నెల కలువ జేరె
అలలు యెంత యెగసినను జలధి జేరె
వెలుగు కిరణములుదయాన యిలను జేరె
తెలుగు వెలుగుల జిలుగులు కళను జేరె!
తే.గీ
రాధ మదిలోన కదలాడు మాధవుడవు
సత్యభామకు పాదములొత్తె నీవు
పాండు సుతులకు హితునిగా యుండె నీవు
గోపికల యెద లోబాపె తాపములను!
తే.గీ
రమణి చెంతకు యొకనాడు రవియె వచ్చె
రవియె తెచ్చెను యెర్రని రవికె యొకటి
రవికె నిచ్చి జూపించెను రంగు పెట్టి
రవికెనందు దాచమనియె రమణి రవిని!