Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శశికళ.బి
ఆ.వె
రమణి కొమరుడైన రవియాడు చుండగా
కొత్త రవికెనామె కుట్ట బోయె
బుజ్జిగాడు యేడ్చె బూచి వానిని జూచి
రవికె నందు దాచె రమణి రవిని!
ఆ.వె
రమణి కొమరుడైన రవి యాడు చుండగా
కొత్త రవికె నామె కుట్ట బోయె
బూచి వాని జూచి బుగులు బుట్టె రవికి
రవికె నందు దాచె రమణి రవిని!
ఆ.వె
తెలుగు లోన కలవు తీరైన గమకాలు
తెలివి పరులు కలరు తెలుగు నాట
తెలుగు పద్య కవిత తేనెల రసపట్టు
వెలుగుచుండు నెపుడు తెలుగు భాష!