Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరంలో
కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించి
మద్రాసులో లా కాలేజీలో బియల్ పట్టాపొంది
న్యాయవాద వృత్తిలో కొంతకాలం కొనసాగి
ఆనక రచనా వ్యాసంగా లలో
మునిగితేలాడు
విశిష్ట సాహితీరచనలు గావించిన
బహుముఖ ప్రజ్ఞాశాలి అడవిబాపిరాజు!
భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని
సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు
సంవత్సరం పాటు జీలుశిక్షను
అనుభవించిన స్వాతంత్ర్య సమరయోధుడు బాపిరాజు!
బాల్యం నుంచే కవితరచనలో
ఆసక్తి పెంచుకుని
అభ్యుదయభావకుడిగా ఎదిగిన భావకవి బాపిరాజు!
చిత్రకారుడిగా చిత్రంచిన చిత్రాల్లో
సముద్రగుప్తుడు , తిక్కన ప్రసిద్ధి
గాంచాయి
ఆయన రాసిన్ నారాయణరావు నవలకు ఆంధ్ర విశ్వకళాపరిషత్ అవార్డు
లభించగా
తన జైలు జీవితనుభవలను
తన తొలకరి నవలలో రచించి
నవలా రచయితగా ఖ్యాతినొందెడు బాపిరాజి!
'బాపి బావ' గా నేటి సాహితీవేత్తలు ముద్దుగా
పిలుచుకుంటు
ఆయన అడుగుజాడల్లో ముందడుగు వేస్తున్నారు
కవిగా, చిత్రకారునిగా, పాత్రికేయుడు, దర్సకునిగా
వివిధ రంగాల్లో ప్రావీణ్యతను
గడించిన
బహుముఖ ప్రజ్ఞాశాలి అడవిబాపిరాజు!
ఆయన వర్ధంతికి అర్పిద్దాం ఘన నివాళులు!
- ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి ,7416638824