Authorization
Tue March 04, 2025 02:46:01 pm
పున్నమి వచ్చి అమావాస్యకు
సుఖాలు వచ్చి కష్టాలకు
మందులు వచ్చి మొండిరోగాలకు
చరమగీతం పాడినట్లు........
ఊహించని రీతిగా
ఊహన్ లో ఉద్భవించిన
విషక్రిమి కరోనా విజృంభణకు.....
మేధావుల కృషి ఫలించి
శాస్త్రవేత్తల పరిశోధనలు సఫలీకృతాలై
కనుగొనబోయే టీకా మందు తో
అనతికాలంలోనే చరమగీతం పాడబోతున్నాం
కల్లోల కరోనా కష్టనష్టాల నుంచి గట్టెక్కబోతున్నాం!
ఈ అన తి కాలంలోనే
మనం అత్యంత జాగరుకులై మెలగాలి
నాకేమి కాదులే అన్న నిర్లక్ష్యాన్ని వీడి
అందరూ బాగుండాలి
అందులో నేనుండాలి అనుకుంటూ
లాక్ డౌన్ కు లాక్ తీసినాక్రమంలో
సంక్రమించిన సడలింపులను అతిక్రమించక
కరోనా రక్షణకవచాలను దరిస్తూ
స్వదేశీ సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ
మహమ్మారి కరోనాను చరమగీతం
పాడుదాం!!
మోడు వారిన వృక్షం చిగురించక మానదు
కరోనా కష్టాలు కడతేరకా మానవు!!
జీవితమనే రంగస్థలంపై
కరోనా పాత్ర కంచికి చేరాక
అందమే ఆనందం
ఆనందమే జీవితమకరందమనే గీతాన్ని అలపిస్తూ
నవాజీవన విధానానికి శ్రీకారం చూడదాం!
చిగురించే ఆశల తోటలో కొత్త పాటల పల్లకిలో
విహరిద్దాం!
- ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి, 7416638823