Authorization
Tue March 04, 2025 08:13:42 am
- శశికళ.బి
ఆ.వె.
ప్రాణవాయువె మన ప్రాణాలు నిలబెట్టు
గాలి పెరిగిన సుడి గాలి యగును
జీవితమున గాలి జీవనాధారము
ప్రాణనాధు దీరు పై విధమ్ము!
ఆ.వె.
తల్లి త్యాగఫలము తనయుని జన్మంబు
ఆదరించు అక్క అమ్మవోలె
కొలువు దీరు లక్ష్మి కూతురై జన్మించి
ఇంతి చెంతనుంటె ఇంటి వెలుగు!
ఆ.వె
గౌరు నాయుడన్న గౌరవం జనులకు
రైతు వెతల కథలు రాసె నతడు
శైలి లోన వారు పోలును గురజాడ
అప్పు వడెను ఉత్తరాంధ్ర రైతు!