Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శశికళ.బి
ఆ.వె
ఆదరించు వారు హాస్టలందున లేరు
ఆకలంచు వారు అలమటించె
కరువు కోరలిట్లు కనిపించె ముందుగా
యువత బాగ యున్న భవిత బాగు!
ఆ.వె
ఉత్తరాంధ్ర ప్రజల ఊపిరిగామారి
కష్ట జీవి కొఱకు కథలు రాసి
గొప్ప సేవ జేసె అప్పలనాయుడు
అప్పు పడిరి మీకు ఆంధ్రులంత !
ఆ.వె
యజ్ఞమంటి కథల విజ్ఞానియాతడు
కాళిపట్న రాము కథల రాజు
తరతరాల కథలు పరిశోధకులు పొందె
కథల నిలయమున్న పథకుడితడు!