Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉభయ కుశలోపరి తో మొదలిడి
ఇంతేసంగతలు....
చిత్తగించవలెను తో
అంతమయ్యే ఉత్తరంలో......
పిల్లలకు పెద్దలదీవెనలు
పెద్దలకు పిన్నల నమస్కారములు
ప్రేమికుల విరహావేదనలు
అత్తారింట కూతురి కష్టనష్టాలు
రచన ప్రచురణకు స్వీకరించిన శుభవార్తలు
తిరిగొచ్చిన రచనతో సూచనలు
పండుగకు కొత్తల్లుడి కోరికల చిట్టాలు
ఇంటర్వ్యూకి కాల్ లెటర్ అందుకున్న చిరుద్యోగుల
చిరుమందహాసాలుంటాయి!
మనిషికి మనిషికే కాదు
మనసుకి మనసుకి వారధులైన
ఉత్తరాలు
నాడు , నేడు ఏనాటికైనా
చిరంజీవులే!
ప్రియమైన వారు వ్రాసిన ఉత్తరం
చదువుతుంటే కలిగే అనుభూతి
నేటి బ్రోవుజింగ్, చాటింగ్, sms ల్లో లభిస్తుందా!?
తోక ఉన్న గాలిపటం
ఎవరెస్టుతో పోటీ పడితే
ఈ తోకలేని పిట్ట
తొంభై అమడళ్ల దూరం పరిగెట్టేది!
నేడు మనుష్యులలో
మానవత్వం అదృశ్యామగుచున్నట్లుగా
ఘన చరిత్రయున్న ఉత్తరం
కనుమరుగౌతున్నది
అందుకు బాధ్యులం మనమందరం!
కోల్పోయిన గత వైభవాన్ని
ఉత్తరం తిరిగి పొందే మధుర క్షణంకై
నిరీక్షిద్దాం అందరం!
లేఖా రచనను ప్రోత్సహిద్దాం!
తోకలేని పిట్టకు ఊపిరి పొద్దాం!
(జాతీయ తపాలా దినోత్సవం సందర్భంగా)
- ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి, 7416638823