Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ బాలికల దినోత్సవం...
ఆడపిల్ల పుడితే
ఆడ...పిల్లేగా అంటూ
గుండెలపై కుంపటి అంటూ
భూమి మీదకు రానికుండా
భృణహత్యాలకు పాల్పడే
హాంతకులున్న నేటి సమాజంలో
మార్పు సాధ్యమేనా!?
ఆడపిల్ల పుడితే మైనస్ అని
మపిల్లాడు పుడితే ప్లస్ అని
లెక్కలు కట్టే నేటి తరుణంలో....
మీ ముందుతరం కూడా
మీలా ఆలోచిస్తే
ఆడపిల్లల జననం జరిగేదా!?
సృష్టి ఆగకుండా సాగేదా!?
ఆడపిల్ల పుడితే
మహాలక్ష్మి పుట్టిందంటూ
ఆనాడు పండుగ చేసుకోబట్టే
ఈనాడు మగపుంగవులు
బతికిబట్ట కడుతున్నారు!
రెండు కళ్ళతో చూస్తేనే
చూసే చూపు సరిగా ఉంటుంది
సూర్యుని కిరణాలన్నీ ప్రసరిస్తేనే
చంద్రుడు వెన్నెల నిచ్చేది!
బాలికలకు ప్రోత్సహాన్ని అందిస్తే
బాలురతో పాటు సమంగా
చదువుల్లో....ర్యాంకుల్లో
ఆటపాటల్లో... ప్రతిభాపాఠవాల్లో
తమ ప్రతిభను నిరూపించుకుంటారు
కుటుంబ గౌరవంతో పాటు
దేశ ప్రతిష్టను పెంచుతారు!
ఆదశిశువుల జననాన్ని
పురిటీలోనే పుట్టకుండా ఆపితే...
ఆడవారి సంఖ్య తరిగి
పెండ్లి చేసుకునేందుకు
వధువుల కొరత ఏర్పడి
మళ్ళీ ఆనాటి కన్యాశుల్కం
పునరావృతం అవుతుంది!
ఇంటికి దీపం ఇల్లలైతే
ఆ ఇల్లాలికి ప్రతిరూపాలు
పుట్టే బాలికలు
ఆ వాస్తవాల్ని గ్రహించి
మన ఇంటి దీపాల్ని వెలిగించుకుందాం
బాలికల సంరక్షణకు నడుం బిగిద్దాం!
ఆళ్ల నాగేశ్వరరావు
apsrtc కండక్టర్
తెనాలి, గుంటూరు.
సెల్ నెంబర్.7416638823