Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతరించిపోతున్న జాతుల్ని
అక్కున చేర్చుకుంటారట అక్కడ
గిర్ అడవుల్లో సింహాలు
నల్లమల అడవుల్లో పులులు
బండిపూర్ అడవుల్లో ఏనుగులు
మరెన్నో... అభయారణ్యాల్లో
ఇంకెన్నో... జీవ జాతులు
చక్కగా సంరక్షిశీచబడతాయట
స్వేచ్ఛగా తిరుగాడుతాయట
అలాగే ..ఇప్పుడు
ఈ
ఆధునిక భారతావనిలో
ఆడపిల్లలకు కూడా
ఓ అభయారణ్యాన్ని నిర్మిద్దాం
కనీసం
అక్కడైన ఆడపిల్లలు
పూదోటలో సీతాకోక చిలకల్లా
ఆనందంగా
ఆడుతూ.. పాడుతూ
తమ బంగారు కలలకు
కొత్త రెక్కలు
తొడుగుతారు
ఎంతై నా
రేపటి
నవ భారతావని కి జీవం పొసే బంగారు తల్లులు వారే కదా
......బత్తుల శ్రీనివాసులు